ఇంట్లో ఈ వస్తువులను వెంటనే బయట పడేయండి…

ఈరోజుల్లో ఎంత కష్టపడి సంపాదిస్తున్నారో, అంత ఈజీగా డబ్బుని వృధా కూడా చేస్తుంటారు కొందరు. ఎందుకు ఏ వస్తువుని కొంటారో వారికే అర్ధం కాదు.ఆఫర్ పెడితే చాలు అవసరం ఉన్నా లేకున్నా వెంటనే ఎదో ఒక వస్తువు కొనేస్తారు. వాటిని ఇంటికి తీసుకుని వచ్చిన తరవాత ఎంతవరకు అవసరమో చూసుకుని వాడరు. కొనేశామా, పక్కన పడేసామా అన్నట్టు ఉంటారు. అసలు అవసరానికి మించి వస్తువులు కొనడం కూడా ఒక బలహీనత మరియు వ్యసనం లాంటిదే అని అనికోవాలి. ఎందుకంటే, అనవసరంగా వస్తువులు కొనడం వలన చాలా డబ్బు నష్టపోతాం. అంటే కాకుండా వాటిని సెలెక్ట్ చెయ్యడానికి అనవసరంగా ఎంతో సమయాన్ని నష్టపోతాం.

కొందరు వస్తువులను వాడకపోయినా ఇంట్లో అలానే ఉంచుతారు. అది అస్సలు మంచి పద్ధతి కాదు. కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా ఒక వస్తువుని వాడటం లేదు అంటే అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. అలాంటి వస్తువు ఇంట్లో ఉండటం మంచిది కాదు. అందుకే ఎంతో అవసరం ఉంటె తప్ప ఇంట్లో ఊరికినే సామాన్లు కొనకూడదు. అంతేకాదు ఏమైనా రిపేర్లు వస్తే, వాటిని వెంటనే బాగు చేయించుకోవాలి. కొందరు పాడయిన వస్తువులను వెంటనే బాగు చేయించరు. ఏముందిలే అలా ఉంచుదాం. తరవాత టైం చూసుకుని బాగుచేయించవచ్చు అని నిర్లక్ష్యంగా వదిలేస్తారు.

పాడయిన వస్తువులను, వాడని వస్తువులను ఇంట్లో ఉంచితే పరమ దరిద్రం అని శాస్త్రం చెబుతుంది. ఇరిగిపోయిన అడ్డం ఇంట్లో ఉండకూడదు. అలాగే పాడయినా రుబ్బు మెషిన్ లు, వాడని వాహనాలు, ఇరిగిపోయిన టీ కప్స్ ఇలా చెప్పుకుంటావు వెళ్తే ఎన్నో వస్తువులు ఉంటాయి. కొందరు టీ కప్ లు కొంచెం పగిలినట్టు ఉన్నా వాటినే వాదెశ్తుంటారు. అలాంటి పనులు అస్సలు చేయకూడదు. పూజ గదిలో కూడా వాడని వస్తువులను గజిబిజిగా ఉంచుకోకూడదు. అది అస్సలు మంచిది కాదు.

పూజ గదిలో కొందరు ఒకదానిలో కుంకుమ వేసి అది పక్కన పెట్టి ఇంకొక దానిలో ఇంకొంచెం వేస్తారు. అలా వేయడం వలన ముందు దానిలో ఉన్నది వాడక అది అలానే పాడయ్యి ఉంటుంది. కానీ దానిని శుభ్రం చేయరు. ఇలాంటి పనులు చేయడం వలన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. బయట ఉన్న లక్ష్మీ ఇంట్లోకి వస్తుంది. అందుకే శాస్త్రం చెప్పిన ప్రకారం ఇంట్లో ఉన్న పనికి రాణి వస్తువులను వెంటనే బయట పడెయ్యాలి…