ఈ రెండు పాయింట్లు నేను ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాలిసివచ్చింది

ఈ రెండు పాయింట్లు నేను ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాలిసివచ్చింది…

ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది అని మన పెద్ద వాళ్ళు, వైద్యులు చెబుతూనే ఉంటారు. ఇది విని ఆహారం విషయంలో నియమాలను పాటించాలంటే ఇంకా దూరంగా వెల్తూ ఉంటాం. ఎందుకంటే… అమ్మో అన్ని నియమాలను పాటించాలా? ఈ ఒక్క రోజుకి తినేస్తా, రేపటి నుంచి పాటిస్తాను, ఈ ఒక్క వారం తినేస్తాను వచ్చే వారం నుంచి పాటిస్తాను, ఈ ఒక్క నెల తినేసి, వచ్చే నెల నుంచి మానేస్తాను అని ఇలా అనుకుంటూ రోజులు, వారాలు, నెలలు గడిపేస్తారు కానీ అసలు నియమాన్ని మాత్రం పాటించరు. అందుకే ఏది చెయ్యాలన్నా ముందు సులభంగా మొదలు పెట్టాలి. తేలిగ్గా అనిపించాలి, ఇష్టాంగా కొత్త ఉత్సవాహంగా ఉండేలా చూడాలి.

ఒక చిన్న పిల్లాడు స్కూల్ కి వెళ్తే ముందు ప్లే స్కూల్ లో వేస్తారు. ఎందుకంటే ముందు పిల్లలతో ఆడుకోవడం, టీచర్ల ప్రేమను అందుకోవడం నేర్పిస్తారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పాఠాలు మొదలు పెడతారు. అలాగే మనం కూడా అక్కడ నుంచి వచ్చిన వారిమే కాబట్టి, అలా సులభంగా ఆనిపిస్తే వెంటనే మొదలు పెడతాము. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా, మొదటి రోజు పని చేసేయ్యము. సాటి ఉద్యోగస్తులు అందరిని పరిచయం చేసుకుంటాం. అందులో మన మనస్తత్వానికి ఎవరు సరిపోతారో చూసుకుని వారితో పరిచయం పెంచుకోవాలని అనుకుంటాం. ఆ తరవాత నిమ్మదిగా వారి దగ్గర వర్క్ ఎలా చెయ్యాలో తెలుసుకుని పనిలో మనం ముందుకు వెళ్ళిపోతాం.

తినే తిండి విషయంలో కూడా అంతే… మనం అసలు ఏమితినకూడదు తెలుసుకుని బాధ, భయం పడే కంటే, అసలు మనం తినగలిగేవి ఏమున్నాయో తెలుసుకోవాలి. వాటిని మనం ముందు పరిచయం చేసుకోవాలి. అందులో మనకు ఏదో ఒకటి నచ్చుతాది. దానితో మన డైట్ మొదలు పెట్టాలి. ఆ తరవాత ఒక్కోక్కటిగా అలవాటు చేసుకోవాలి. అంతే కాదు చేసే పనిలో సుళువుని, ఇష్టాన్ని, ఇంట్రెస్ట్ ని ఎలా వెతుక్కుంటామో… తినాల్సిన తిండి లో కూడా అలా సుళువుని, ఇష్టాన్ని, ఇంట్రస్ట్ వెతుక్కుని మన ఆరోగ్యానికి మంచి చేసే వాటిని తినాలి.ప్రకృతి ఇచ్చిన పండ్లను, కాయగూరలను, పప్పులను ఎలా తినాలో, ఏ సమయంలో తినాలో, ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవాలి.

నువ్వులు, మినగపప్పను, శనగపప్పు, వేరుశనగ పలుకులు వీటిని వేరు వేరుగా వేపుకుని పొడి చేసుకుని పెట్టుకుంటే… ఒక్కొక్క రోజు ఒక్కొక్క పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఎంత రుచిగా ఉంటాది, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాది. పండ్లు తినాలి అనుకుంటే, షుగర్ వ్యాధి ఉన్నవారు పండ్లు తింటే ఇంకా షుగర్ పెరుగుతాదని తినరు. కానీ వాళ్ళు తినచ్చు అనే పండ్లే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు తినాల్సినవి ఏమున్నాయో, అందులో ఏదైనా వీళ్లకు నచ్చుతాదేమో అని చూడరు. వీళ్ళు తిన కూడని వాటి గురించి మాత్రమే ఆలోచించి చింతిస్తారు. ఈ చింతతో అవి తినకపోయినా షుగర్ మాత్రం పెరగటం ఖాయం… అసలు ఆరోగ్యాంగా ఉండటానికి ఆనందకరంగా ఆహరం ఎలా తీసుకోవాలో పై వీడియోలో చూడండి…