ఈ 2 కారణాల వలనే కంటి చూపు సమస్య వస్తుంది.ఈ చిట్కా పాటిస్తే 10 రోజుల్లో కళ్ల జోడు మాయం.

ఈ విషయాలను గాని మీరు సోషల్ మీడియాలో పెడితే ఇంతే సంగతులు…

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు సోషల్ మీడియాకు జనం ఎంతగా అలవాటు పడుతున్నారో మనం చెప్పనక్కరలేదు. ప్రతీ నిమషం వారు ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు? ఇలాంటి విషయాలు అన్నిటిని వారి సోషల్ మీడియా ఖాతాల్లో తెలుసుపుతున్నారు. సరిగ్గా వాడుకుంటే సోషల్ మీడియా మనిషి దొరికిన వరమే అని అనుకోవాలి. అలా కాకుండా, దానిని దుర్వినియోగ పరుచుకునేవారు, దానిని ఆధారంగా చేసుకుని ఇతరులను నిందించేవారు కూడా ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని వివరాలు, ఫోటోలు పోస్ట్ చేయడం వలన చాలా నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఈ క్రింది విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయద్దని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం…

  1. ఈ రోజుల్లో సెల్ఫీ లు తీసుకోవడం చాలా సామాన్యం అయిపొయింది. సెల్ఫీ తీసుకోవడం వాటిని వెంటనే సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఒక అలవాటుగా మారింది. పైగా సెల్ఫీ తీసుకునేటప్పుడు, చేతి వేళ్ళను చూపిస్తూ మరీ తీసుకోవడం ఒక అలవాటుగా మారింది. దీని వలన చాలా పెద్ద రిస్క్ ఉందని తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చెయ్యగానే, కొందరు సైబర్ నేరగాళ్లు, మన వేలిముద్రలను సేకరించగలరంట. దానితో ఒక వ్యక్తి డిటైల్స్ అన్ని సేకరించవచ్చని జపాన్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ ఇన్‌స్టిట్యుట్ పరిశోధకుడు ఇసావో ఎషిజన్ తెలిసారు.
  2. ఏదైనా ఊరు వెళ్తున్నాము అనగా సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకుంటారు. అక్కడకు వెళ్లిన తరవాత ఆ పోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తారు. దీని వలన వాళ్ళ ఇళ్లల్లో ఎవ్వరు ఉండరని కనిపెట్టిన దొంగలు వాళ్ళ ఇంటి పై పడి దోచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈమధ్య ఇలాంటి కేసులు చాలా నమోదు అవుతున్నాయి.
  3. మన పేరు, అడ్రస్, పుట్టిన తేదీ గాని సోషల్ మీడియాలో ఖాతాలో  పెడితే, దాని ద్వారా మీ గుర్తింపుని పొంది… మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. కొందరు పుట్టిన తేదీని కొన్ని ముఖ్యమైన వాటికి పాస్ వర్డ్ గా పెట్టుకుంటారు. అలాంటి పుట్టిన టెడ్ ని సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టడం వలన, లేదా ఎవరైనా ఆరోజున ఇన్నవ పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలుపడం వలన మీ ఆధారాలు పసిగట్టి మోసాలు చేస్తారు.

4.అలాగే సోషల్ మీడియాలో ఫోన్ నెంబర్ ఇస్తే, చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉందట. ఫోన్ నెంబర్ ద్వారా, వ్యక్తిగత వివరాలు, ఫోటోలను సేకరించగలట.

  1. అలాగే తమ పిల్లల ముద్దు మాటలు, ముద్దు చేష్టలను సోషల్ మీడియాలో పెడుతుంటారు తల్లి తండ్రులు. అది కూడా చాలా రిస్క్ అని అంటున్నారు నిపుణులు. దాని వలన పిల్లలను కిడ్నాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేసే ముందు కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు…