ఉదయాన్నే లేచిన వెంటనే ఈ చిన్న పని చెయ్యండి మీరు చాలా ఆరోగ్యంగా వుంటారు

మీ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఇలా చేయండి… 

విద్య మనిషికి ఎంతటి అవసరమో మనందరికీ తెలుసు. చదువు అనేది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. చదువుకునే వయసులో పిల్లలు తడువు మీదే దృష్టి పెట్టాలి. లేకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అయితే చదువు అంటే కేవలం పుస్తక జ్ఞానం ఉంటె సరిపోదు. పుస్తకంలో చదివినిది ఆచరణలో పెట్టాలి. కొందరు పిల్లలు బాగా చదువుకోవడం అంటే 24 గంటలు పుస్తకాలు పట్టుకుని చదువుతూ ఉండటం అని అనుకుంటారు. అలానే చదవాలి, కానీ చదివినది ఎంతవరకు మనకు అర్ధం అవుతుందో తెలుసుకోవాలి. సైన్స్ ఎంతవరకు అర్ధం అయ్యిందో తెలుసుకోవడానికే లాబ్స్ ఉంటాయి. కానీ మనకు భాష గాని, సోషల్ గాని, లెక్కలు గాని ఎలా వస్తున్నాయో తెలిసియాలంటే… ప్రపంచంలోనే నేర్చుకోవాలి. 

నలుగురితో మాట్లాడుతూ ఉంటె, భాషా జ్ఞానం పెరుగుతుంది. అలాగే వారితో మాట్లేడేప్పుడు ,ప్రపంచంలో ఎన్నో విషయాలు గురించి చర్చిస్తూ  ఉంటె… మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. దానినే సోషల్ అంటారు. అలానే మనం ఎక్కడ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనకు ఎంత డబ్బు కావాలి, మనం ఎవరికైనా ఎంత ఇవ్వాలి ఇవన్నీ బాగా తెలిస్తే దానిని లెక్కలు అంటారు. ప్రాక్టీకాలిటీ లేని మనిషి ఎంత చదువుకున్నా వృధానే. చదువుకునే పిల్లలు గాని లేదా వాళ్ళ తల్లి తండ్రులు కానీ వారి ప్రతిభ గురించి ఒక అంచనా వెయ్యాలి. దానిని బట్టి వారు ఎం చదివితే 

పిల్లల్లకు చదువుతో పాటు తల్లితండ్రులు పద్దతులను, క్రమశిక్షణను,మన ఆచారాలను నేర్పించాలి. ఎంత చదువుకున్నా క్రమశిక్షణ లేని పిల్లలు సక్రమ మైన దారిలో వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి. తల్లితండ్రులు పిల్లలను తీర్చిదిద్దడం అంటే ఎక్కువ ఫీజులు కట్టే స్కూల్స్ లో కాలేజీల్లో వెయ్యడం కాదు. వాళ్లకు కావాల్సినవి అన్ని అమర్చడం ఎంత ఆవాసరమో, అలాగే వాళ్ళు నేర్చుకోవలసినవి నేర్పించడం కూడా అంతకన్నా అవసరం. పెద్దవాళ్లకు గౌరవడం ఇవ్వడం నేర్పించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి అనేది నేర్పించాలి. పొదుపుగా ఉండటం నేర్పించాలి. ఈరోజుల్లో పిల్లలకు తల్లి తండ్రులు ఖచిత నేర్పించాల్సిన విషయం ఇది. పొదుపు అనేది లేకపోతే, మనిషి ఎంత సంపాదించినా నిలువదు. 

అనవారమైన ఖర్చలు, ఆడంబరాలు, దుబారా అలవాటు అయితే సంపాదన లేనప్పుడు వాళ్ళు తప్పుడు దారులు వెతికే అవకాశాలు లేకపోలేదు. అయితే కొందరు పిల్లలు తంతా చదువుకున్నా పాపం మరచిపోతూ ఉంటారు. అలాగే చదివే చదువు పై శ్రద్ధ కూడా పెట్టలేరు. అలాంటి పిల్లలతో తల్లితండ్రులు పొద్దుటే లేపి, స్నానం చేసి భగవంతుని దగ్గర దీపం గాని అగరతు గాని వెలిగించమని చెప్పండి. అలాగే హయగ్రీవ స్తోత్రం మూడు సార్లు పఠించమని చెప్పండి. జ్ఞాన ప్రదాత అయినా హయగ్రీవుని అనుగ్రహం ఉంటె పిల్లలు శ్రద్దగా వారంతట వారు చదువుకుంటారు. అలాగే సరస్వతి 
కవచ  పారాయణం చేయడం కూడా చాలా మంచిది.