ఒబేసిటీ ఎందుకు వస్తుంది.? చిట్కాలు పాటించండి.కొండలాంటి పొట్ట10 రోజుల్లో కరగడం మొదలవుతుంది

ఒబేసిటీ ఎందుకు వస్తుంది.? చిట్కాలు పాటించండి.కొండలాంటి పొట్ట10 రోజుల్లో కరగడం మొదలవుతుంది
వయసు బేధం లేకుండా ఈ రోజుల్లో ఎంతో మందిని ఒబేసిటీ  బాధిస్తుంది. ఒబేసిటీ వలన బరువు పెరిగి అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలిసినప్పటికీ ఈ సమస్య నుంచి బయట పడటం గురించి ఆలోచించరు. చిన్న చిన్న పిల్లల్లకు ఈ రోజుల్లో ఈ సమస్యను చూస్తున్నాం. దీనికి కారణం తినే తిండి, మన లైఫ్ స్టైల్. తిండి ఎప్పుడు బడితే, ఎంతబడితే అంత తినడం. తినకపోతే అస్సలు తినడం మానేసి, ఒకేసారి ఎక్కువ తినడం, కదలకుండా కూర్చున్న ప్లేస్ లోనే ఎక్కువ సేపు కూర్చోవడం.పని అంటే బద్దకించడం, వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చుని ఉండటం, రోజు సరైన వ్యాయామం చేయకపోవడం, ఇంకా వారసత్వం ద్వారా రావడం… ఇలా అనేక కారణాల వలన ఒబెసిటీ బారిన చాలామంది పడతున్నారు.

అంతేకాదు చిన్న చిన్న పిల్లలకు కూడా పొట్ట ఎక్కువగా కనిపిస్తుంది. దానికి కారణం జంక్ ఫుడ్ తినడం. ఇంట్లో వండే ఆహారం పిల్లలకు నచ్చడం లేదు. దానికి కారణం కేవలం పిల్లలు అని మాత్రమే అనుకోనక్కరలేదు. పెద్దవాళ్ళు కూడా పిల్లలకు అలాంటి అలవాట్లను అలవాటు చేస్తున్నారు. జంక్ ఫుడ్ తినడం వలన చిన్న పిల్లల సైతం ఒబెసిటీ సమస్య ను ఎదుర్కోవలసి రావడమే కాకుండా అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరించాల్సి వస్తుంది. ఇక వయసులో ఉన్నవారు అధిక బరువు, బారెడు పొట్టలతో ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా అందం లేక, బరువు ఎక్కువ అవ్వడం వలన బద్ధకం పెరగడం వలన చేయాల్సిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయక… వృత్తి పరంగా కూడా వెనకబడతున్నారు.

బరువు ఎక్కువ అవ్వడం వలన వయసు మీద పడిన వారు మరింత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా, తగ్గడం కష్టం అవుతుంది. అంతే కాదు అధిక బరువు ఉన్న వారికి ఆపరేషన్స్ అలాంటివి చేసాక సెట్ అవ్వడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే… ఒబెసిటీ అనే సమస్య తో జీవితంలోకి ఎన్నో సమస్యలకు స్వాగతం చెప్పినట్టే అవుతుంది. సరైన ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ బాగా తగ్గించడం, రోజు క్రమం తప్పకుండ వ్యాయామం చేయడం, బయట ఫుడ్ కు పిల్లలనే కాకుండా వండటానికి టైం, ఇంట్రెస్ట్ లేక పెద్ద వాళ్ళు కూడా అలవాటు చేసుకోకపోవడం మంచిది.

అసలు ఒబెసిటీ అంటే ఏమిటి? దాని వలన ఎలాంటి సమస్యలు వస్తాయి? దాన్ని ఎలా తగ్గించులకోవచ్చు అనే దాని పై వైద్యులు పూర్తి అవగాహన ఇస్తున్న పై వీడియో చూడండి…