కొన్ని విషయాలలో కాలం మీకు అనుకూలంగా లేకపోతే ఇలా చేయండి…

ఏమిటోనండి నాకు కాలం అస్సలు అనుకూలంగా లేదు అని కొందరు అంటారు. అంటే వాళ్లకు సమయానికి ఏ పని అవ్వడం లేదని. కాలం అంటే మరో వైపు నుంచి దైవం అని కూడా అర్ధం అందుకే ఏ సమస్యనైనా కాలమే తీరుస్తుంది అని అనుకుంటారు. ఇక్కడ ఏ సమస్యనైనా మన తీర్చలేకపోతే ఆ దేవుడే తీర్చాలి అని అనుకుంటాం. కాలాన్ని ఆ పరమేశ్వరునితో పోలుస్తారు కాబట్టే, సమస్యని ఆ కాలానికి వదిలేస్తారు. అసలు సమస్యను కాలానికి వదిలెయ్యడం అంటే, మనం ఏమి చెయ్యకుండా అలా కలం పరిష్కరిశ్తుందని ఎదురు చూడటం కాదు. మానవ ప్రయత్నం మనం చేస్తూ, ఆ రిజల్ట్ వచ్చే వరకు సమయం కోసం ఎదురు చూస్తే, కాలం మనకు మంచి రిజల్ట్ తప్పకుండా ఇస్తుంది.

కలం కలిసిరావడం లేదు అంటే,శుక్రుడు జాతక రీత్యా శుభుడుగా లేడని అర్ధం. శుక్రుడు జాతక రీత్యా శుభాంగా లేడు అంటే ఏమి చేస్తే మంచిదో తెలుసుకుందాం… నిత్యం ఉదయాన్నే పూల చెట్లకు నీళ్లు పోస్తే మంచిది. అలాగే బ్రాహామానులకు శుక్రవారం నాడు పంచదార దానం చేస్తే మంచిది. పండితులకు భోజనం పెట్టి తెల్లని వస్త్రాలు, తాంబూలం ఇచ్చి వారి కాళ్లకు దండం పెడితే మంచిది. అలాగే కొందరికి బంధువులతో సత్సంబంధాలు సరిగ్గా ఉండవు. అందులోను తండ్రి వైపు బంధువులతో సరిగ్గా సంబంధాలు లేవు అంటే అర్ధం ఏమిటంటే… మీకు రవి బలహీనంగా ఉన్నాడని అర్ధం. రవి బలహీనంగా ఉన్నాడని అంటే, ఈ క్రింది పనులు చేయాలి.

రోజు వినాయకుడికి పూజ చెయ్యండి. దీని వలన ఎవరితోనూ విరోధం ఉండదు, ఎటువంటి ఆటంకాలు కూడా ఉండవు. అలాగే నిత్యం సూర్య నమస్కారం చేస్తే మంచిది. దీనితో పాటు ఆదిత్య హృదయం పాటించడం వలన కూడా మంచి జరుగుతుంది. ఖర్జూర పండ్లను బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది. ఏఖముఖి రుద్రాక్ష లేదా కెంపు ధరించడం వలన అంతా శుభంగా ఉంటుంది. అలాగే రాహు గ్రాహం అనుకూలం కోసం, ముల్లంగి దానం చేస్తే మంచిది. శుక్రవారం బ్రాహామానులకు ముల్లంగి దానం చేయడం వలన అంతా శుభంగా ఉంటుంది. ఇలా నాలుగు శుక్రవారాలు వరసగా చేస్తే చాలా మంచిది. అలాగే ప్రతీరోజు గాయత్రి మంత్రం పటిస్తే చాలా మంచిది. గాయత్రి మంత్రం జపించేవారికి గ్రహ పీడలు, చీడలు ఉండవు. బలము , బుడ్డి, జ్ఞానము, తేజస్సు అన్ని వస్తాయి…