గ్రహ దోషాలు తగ్గటానికి ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించండి…

చాలా మంది తమ శక్తి కొద్దీ ఎంతోకంత కష్టపడి, తనకు తగ్గట్టుగా ఎదగాలని అనుకుంటారు. కొందరు ఏమి చెయ్యకుండా జీవితాన్ని అలా గడిపెయ్యాలి అనుకున్నారు. ఏమి చెయ్యకుండా జీవితాన్ని అలా గడిపెయ్యాలి అంటే ఎవరైనా ఏమైనా సంపాదించి ఇవ్వాలి. అలా అయితేనే మనషి జీవితం సాఫీగా సాగుతాది. లేదంటే బ్రతకడం చాలా కష్టం. అంతేకాదు, ఒకరి సంపాదనతోనో, ఎదుటివారి హక్కుతోనో బ్రతికే బ్రతుకు ఎప్పటికి నిఖరం కాదు. ఎవరికీ కావలసినది వాళ్ళే సంపాదించుకోవాలి. దానిలోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకోవాలి. అలా కొందరు అనుకున్నప్పటికీ, ఎంతమాత్రం కలసి రాకుండా ఉంటాది. ఏమి చేసినా ఎందుకు కలిసిరావడం లేదు అని ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఏమి తప్పు చేస్తున్నారో, ఎందుకు అనుకున్న పనులు అనుకున్నట్టు అయ్యి, సంపాదించలేకపోతున్నాం అని ఆలోచిస్తూ ఉంటారు.

అనుకున్న పనులు అనుకున్నట్టు అయ్యి పనులు విజయవంతం అవ్వాలి అంటే, మన కృషితో పాటు మనకు గ్రహ అనుకూలతలు కూడా ఉండాలి. గ్రహదోషాలు కనుక ఉంటె, మనం అనుకున్న కార్యాలు జయప్రదంగా జరగవు. గ్రహదోషాలు కొంతవరకు తగ్గాలంటే మనలో ఉన్న కొన్ని లోపాలను మనం వదిలెయ్యాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… బద్ధకం… కొందరికి ఏ పని చెయ్యాలన్నా చాలా బద్దకంగా ఉంటుంది. ప్రతీ పనిని వాయిదా వేస్తూ ఉంటారు. ఆడవారు అయితే నటిని సరైన సమయానికి శుభ్రం చేయరు. వారు సరైన సమయానికి లెవరు, ఇంట్లో ఉన్నవారిని లేపారు. మనిషికి బద్ధకం అస్సలు మంచిది కాదు. బద్దకాన్ని వదిలేస్తే గ్రహ దోషాలు కొంతవరకు తగ్గుతాయి.

కొందరికి మూర్ఖత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా వినరు. వాళ్ళు పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని అంటారు. అలాంటివారి
జీవితంలో చాలా నష్టపోతారు. ఎవ్వరూ వీరికి అస్సలు సాయం చేయరు. వీరితో ఎలాంటి లావాదేవీలు చేయడానికి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మూర్కులతో ప్రయాణం చాలా కష్టంగా నష్టంగా ఉంటుందని ఎదుటివారు అర్ధం చేసుకుని వారిని వదిలేస్తారు. ఈరోజుల్లో ఎక్కువమందిని పీడిస్తున్నవి వ్యసనాలు. వ్యసనాలు మనిషిని చాలా నీచమైన స్థాయికి తీసుకుని వెళ్తాయి. మందు అనే వ్యసనం వలన మనిషి సగం రోజు మత్తులోనే ఉంటాడు. ఇలా మత్తులోనే జీవించే మనిషి ఏ పని చేయగలడు? ఎంతకని చేయగలడు? వ్యసనం ఉంటె మనిషికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. అలా గౌరవం లేని, మనిషి ఉన్నతికి రావడం కూడా కష్టం.

కొందరు ఎప్పుడు చూసినా ఎదుటివారిని దూషిస్తూ ఉంటారు. దాని వలన వారు ఏమి ఆనందం పొందుతారో తెలియదు కానీ, అనేక కష్టాలను ఎదుర్కుంటారు. అనవసమైన సమస్యలలో చిక్కుకుంటారు. ఎదుటివారిని దూషించే అలవాటు వలన మనకు అందరూ దూరం అవుతారు. సాటి మనిషితో మంచి కమ్యూనికేషన్ లేకపోతే మనిషి ఎంత కష్టపడినా, తన శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. కొందరు ఎవరైనా దేవుని ప్రసాదం ఇస్తే వేంటనే వద్దు అంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. భగవంతుని ప్రసాదం ఇచ్చేటప్పుడు కాదని అనకుండా కొంచెం అయినా తీసుకోవాలి. కళ్ళకు అడ్డుకుని తినాలి. ఇలాంటి అలవాటులను మనిషి అలవరచుకుంటే, గ్రహదోషాలు కొంతవరకు తగ్గించుకోవచ్చు …