టిఫెన్ లో ఇవి వాడుతున్నారా అయితే జాగ్రత్త

టిఫిన్… ఇది రోజు మనల్ని పలకరించే ఆహారం. దీనినే తెలుగులో అల్పాహారం అని అంటారు. మన పూర్వీకులు టిఫిన్ ని చాలా గట్టిగా తినేవారు. గట్టిగా అంటే గట్టిగా కొరకటిదానికి వీలులేవని కాదు. చాలా ఎక్కువ బలాన్ని, స్ట్రెంత్ ని ఇచ్చేవి తినేవారు. ఉదయాన్నే చక్కగా చద్దన్నం తినేవారు. అందులో ఉల్లిపాయ నంచుకుని కమ్మగా చక్కగా తినేసి, పనులకు వెళ్ళిపోయేవారు.ఇంత చక్కగా శుభ్రంగా కడుపు నిండా బలంగా ఉండే తిండి ని తిని వెళ్లి, వారి పని వాళ్ళు బాగా చేసుకునేవారు. పొద్దుట టిఫిన్ ఎక్కువ తిని, మధ్యాహ్నం కొంత మోస్తరుగా తిని, రాత్రి తక్కువగా తొందరగా తిని అరిగిపోయిన తరవాత తొందరగా పడుకునేవారు.

కానీ ఇప్పటి జనరేషన్ చాలా విరుద్దంగా ఉంది. టిఫిన్ అంటే చద్దన్నం అనేది ఎప్పుడో మరచిపోయారు. నిజానైకి అన్నానికి సంబంధించింది తింటే నిద్ర వచేస్తాది, ఆఫీస్ లో పని చేయలేము అని అంటారు. కానీ వీళ్లకు నిద్ర వచ్చేది పొద్దుట అన్నం తినడం వలన కాదు, రాత్రి తొందరగా పడుకోకపోవడం వలన, అన్నం తింటే నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. అదే సమయానికి తిని సమయానికి పడుకుని లేస్తే, అన్నం తిన్నా కూడా నిద్ర రాదు.కడుపుకి తిండి, కంటికి నిద్ర సరైన సమయంలో, సమపాలలో ఇవ్వాలి. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము.

ఇప్పటి జనరేషన్ టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ,పూరి,గారి,ఆమ్లెట్,బ్రెడ్ ఇలా ఒకొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. కొందరు నాకు ఇడ్లీ అస్సలు వద్దు, పూరి అంటే ముద్దు అంటారు. మరి కొందరు దోశలో బాగా నూనె వేసి రోస్ట్ గా కాలిస్తే నచ్చుతాది. నేను అలా మాత్రమే తింటాను అంటారు. మరి కొందరు టిఫిన్ చేసుకుని తినే సమయం లేక బ్రెడ్ తినేస్తారు. ఇంకొందరు గుడ్డు తిని పాలు తాగుతారు. ఇలా మన ఇష్టాలకి అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ, అసలు మనకు ఏ వయసులో, ఎలాంటి ఫుడ్ అవసరం అని అందరం ఆలోచించడం మానేసాం.

పోనీ ఈరోజుల్లో చద్దన్నం టిఫిన్ గా తినడం కష్టం అనుకుంటే, మాములుగా మీరు అలవాటు పడ్డ ఇడ్లీ, దోశా. పూరి, గారి… ఓ;;అంటి వాటిని తినేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటిస్తే మంచిది. ఇవే తినాలి అనుకున్నా, తిండి విషయంలో అమ్మ చేతితో ఏమి వండితే అది తినడం మంచిది. అమ్మ పిలల్లకు కావల్సినవి, ఇంకా వారి ఆరోగ్యానికి మంచి చేసేవి చూసి పెడుతుంది. అలాంటి అమ్మ చేతి వంట తినడం మానేసి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని రోజు తినడం అలవాటు చేసుకుంటె, ఆఖరికి ఆరోగ్యం అణగారిపోతుంది. అంతేకాదు టిఫిన్ తినేటప్పుడు వాటిలో కొన్ని వాడకూడదు, కొన్ని వాడాలి. అవేమిటో పై వీడియోలో చూడండి….