తల్లితండ్రుల దీవెనలు ఎంత బలమో తెలుసా?

తల్లితండ్రుల దీవెనలు ఎంత బలమో తెలుసా?
తల్లితండ్రులు దైవంతో సమానం అని మన పురాణాలు చెబుతూనే ఉన్నాయి. తొమ్మిది నెలలో కడుపులో మోసి, తన ప్రాణాలకు తెగించి మనకు జన్మనిస్తూ… తాను పునర్జన్మ తీసుకుంటుంది తల్లి. అలాగే తన భుజాలపై బిడ్డను మోసి, కొండంత బాధ్యతను ఎంతో ఇష్టాంగా మోస్తూ మురిసిపోతుంటాడు తండ్రి. అటువంటి తల్లితండ్రులకు మనం ఏమి చేస్తున్నాం. ఎంత గౌరవం ప్రాధాన్యత ఇస్తున్నాం. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టు చదువుకుని మనం ప్రయోజకులం అవ్వాలని కొందరు అనుంకుంటారు.

వారి మీద ఆధారపడకుండా మనకు మనకు మనం ఎదిగితే చాలని కొందరు అనుకుంటారు. తల్లితండ్రులకు ఒకవేళ డబ్బు లేకపోతే, వాళ్లకు డబ్బు ఇస్తేచాలని కొందరు అనుకుంటారు. అసలు తల్లితండ్రులు నాకేమి చేశారు. వాళ్ళ నాన్న ఇసినంత డబ్బు నాకు మానాన్న ఇవ్వలేదు అలాంటి తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని అనుకునేవారు కూడా ఉంటారు. మరికొందరు అయితే మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, వీళ్ళతో మాకేం పని అనుకుంటారు. మరికొందరు మేము మా బ్రతుకకు తగినంత సంపాదించుకుంటుంటే, వీరి పెత్తనం మా మీద ఏమిటని కొందరు అనుకుంటారు.

ఇక కొడుకు అయితే భార్యరాగానే మారిపోయి, తల్లితండ్రులను దూరంగా పెడతారు. భార్య చెప్పిన మాటలు విని పొందారు తల్లితండ్రులను అనరాని మాటలు అంటారు. ఇలాంటి పనులు చాలా తప్పు. ఎవరిస్థానం వాళ్లకు ఇవ్వాలి. వారిని అనుకూలంగా గౌరవించాలి.తల్లిస్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. ఎవరి ప్రాధాన్యత వాళ్లకు ఇస్తూ ఉండాలి. ఇద్దరిలో ఎవరి కోసం ఎవరిని చిన్న చూపు చూడకూడదు. అలాగే కూతురు పెళ్లి కాగానే తల్లి తండ్రులను మరచిపోవాల్సిన అవసరం లేదు. అలాగే అత్తమామలను అశ్రద్ధ చేయాల్సిన అవసరం కూడా లేదు.స్త్రీ అందరిని ఆదరించే గుణంతో ఉండాలి. అప్పుడే ఆమెకు అంత గౌరవం వస్తుంది ,అందుకే ఆమెను దేవతామూర్తిగా పురాణాలు పూజించమని చెప్పాయి.

తల్లితండ్రులను గౌరవించండి. వారిని సంతోషంగా ఆనందంగా ఉంచండి. జాతకదోషాలు ఉన్నప్పటికీ, ఎన్ని పూజలు హోమాలు చేయించినా వాటితో పాటు తల్లితండ్రులకు సేవ చేయండి. దాని వలన సకల దోషాలు పోతాయి. తల్లితండ్రుల ఆశీర్వాదం చాలా అవసరం. వారి దీవెనలు మనిషికి సగం బలాన్ని ఇస్తాయి. మనం ఏ పని మీద వెళ్లినా వారి ఆశీర్వాదం మనకు ఎన్నో విధాలుగా జయలను కలిగిస్తుంది. అంతేకాని తల్లితండ్రులతో విభేదం గాని పెట్టుకుంటే, కొన్ని గ్రహాలూ మీకు వ్యతిరేకంగా ఉన్నాయని అర్ధం. వాళ్ళను బాధ పెట్టడం వలన మనకు నష్టమే తప్పితే ఇంకేమి ఉండదు. మనస్ఫూర్తిగా వాళ్ళు గాని బాధపడితే, ఆ ఉసురు మనకు ఖచితంగా తగులుతుంది. మనం ఎంత కష్టపడినా వారిని బాధ పెడితే, అస్సలు కలసిరాదు. ఎన్నో శాస్త్రాలు తల్లితండ్రులది ఈ సృష్టిలో అత్యుత్తమ స్థానం అని చెబుతున్నాయి…