సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ రేటింగ్ ఎలా ఉందంటే…

అనిల్ రావేలపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండగ సినిమాల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ ఫాన్స్ చాలా పెద్ద అంచనాలతో ఉన్నారు. ఎందుకంటే దర్శుకుడు అనిల్ రావేలపూడి మంచి హిట్ రేంజ్ లో ఉన్నాడు. అలాగే హీరో మహేష్, హీరోయిన్ రష్మిక కూడా మంచి హిట్ పొజీషన్ లో ఉన్నారు. అందుకే ఈ పండక్కి ఈ సినిమా భారీ హిట్ కొట్టడానికి ఎటువంటి ఆటంకం ఉండదని అభిమానుల అంచనా. అయితే ఈ రోజు రిలీజ్ అయిన మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరు ఎలా ఉందొ తెలుసుకుందాం…

సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు 7 గంటల షో నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా థియేటర్ల ముందు అభిమానులు పోటెత్తుతున్నారు. ఈరోజు నుంచి తెలుగు ప్రేక్షకులకు పండగ మొదలయిపోయింది. మహేష్ ఫాన్స్ థియేటర్ల దగ్గర పండగ వచ్చేసింది, సంక్రాంతి అల్లుడు సూపర్ డూపర్ హిట్ తో మన ముందుకు వచేసాడు అంటూ అల్లర్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ అఫ్ కంప్లీట్ అవ్వగానే ఆడియన్స్ బయట ఉన్నవారికి ఫస్ట్ ఆఫ్ అదిరింది అంటూ మెస్సేజ్ లు పెట్టేసారు. దానితో బయట టికెట్స్ దొరక్క ఎదురుచూస్తున్న ఫాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ సినిమాలో 13 సంవత్సరాల తరవాత విజయశాంతి ఇప్పుడు మళ్ళి ఆడియన్స్ ముందుకు రావడం ఒక ప్రత్యేకత. అందుకోసం ఈ సినిమాకి ఇంకా ఆత్రం కలుగజేస్తుంది అభిమానులకు. ఇక మహేష్ బాబు సినిమా అంటే అదొక కొత్త ఊపుని ఖచ్చితంగా ఇస్తుంది అన్నట్టు అభిమానుల గుండెల్లో ఉన్న అభిప్రాయం. ఈ సినిమాలో మహేష్ బాబు నటన మరియు డాన్స్ కు 5 కి 4 రేటింగ్ ఇస్తునానరు అభిమానులు. హీరోయిన్ రష్మిక ప్రతీ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంటుంది. అలానే ఈ సినిమాలో కూడా తన ప్రత్యేకతను చాటుకుందట. రేష్మీకి ఈ సినిమాలో 5 కి 3 రేటింగ్ ఇస్తున్నారు.

ఇక దర్శుకుడు అనిల్ రావేలపూడి విషయానికి వస్తే, తన ప్రతీ సినిమాకి తాను ఒకే పంధాలో లో వెళ్తున్నాడు. అదేమిటంటే… ప్రజంట్ ప్రేక్షకుడికి ఎం కావలి అని ఆలోచిస్తాడు. దాన్ని బట్టే కథ రాసుకుని, స్క్రిప్ట్ ని అలా తీసుకుని వెళ్ళిపోతాడు. అతని ఈ ఆలోచనలకు, హిట్ రూపంలో సినీ అభిమానులు ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడికి 5 కి 4 రేటింగ్ ఇస్తున్నారు ప్రేక్షకులు. మొత్తం మీద పండగ సినిమాల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని పేరు సంపాదించుకుంది.