2020లో ఈ నాలుగు రాశుల వారికి స్టార్ తిరుగుతుంది…

మనిషి జీవితం మీద నవగ్రహాల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మానవులు గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. మనుషుల అందరి స్థితి ఒకేలా ఉండదు. వారి గ్రహస్థితిని బట్టి వారి జాతకం నిర్ణయం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం లో 12 రాశులు ఉంటాయి. 12 రాశుల వారి లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. పుట్టిన రాశిని బట్టి వారికి ఆ లక్షణాలు వస్తాయి. ఒక్క రాశి పై ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తాయి గ్రహాలు.
2020 లో ఏ రాశి వారికి ఎలా ఉందొ తెలుసుకుందాం…

మేష రాశి-ఆరంభం బాగుంటుంది. ఆర్ధికంగా మంచి స్థాయిలో ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్థులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు బాగా కలసి వచ్చి ధనలాభం కూడా బాగుంటుంది. అలాగే వైవాహిక జీవితం కూడా బాగుంటుంది.

కర్కాటక రాశి- ఈ రాశి వారికి కొత్త సంవత్సరం బాగా కలసి రావడమే కాకుండా, ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. పని ఒత్తిడి కారణంగా కొంచెం జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. దాన్ని కొంచెం సర్దుకుపోతే అన్ని ఆనందంగానే ఉంటాయి.

సింహ రాశి- ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. వీరికి కొన్ని రకాలుగా బాగానే ఉంటుంది. విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది.

కన్యా రాశి- ఈ రాశివారికి తీసుకునే ప్రతీ నిర్ణయం చాల బాగా కలసి వస్తుంది. అలాగే మంచి గుర్తింపు కూడా వస్తుంది. ధనం కూడా పుష్కలంగా లభిస్తుంది. అయితే కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటె మంచిది.

తులా రాశి- ఈ రాశి వారు జీవితంలో జరిగే సంఘటనలకు కృంగిపోకుండా ముందడుగు వేయాలి. మంచి సాధనతో ముందడుగు వేస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వీరికి ఆర్ధిక క్రమశిక్షణ ఉండటం వలన ఆర్ధికంగా బలంగా ఉంటారు. కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు బాగుంటాయి.

కుంభరాశి- ఈ రాశివారు చాలా సమస్యల నుంచి ఈ ఏడాది బయట పడతారు. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వలన ఆనందంగా ఉంటారు. వీరు మంచి పేరు సాధిస్తారు. డబ్బు ఇబ్బంది లేకుండా మంచి సంపాదన ఉంటుంది.