బరువు తగ్గితే మాత్రం జాగ్రత్త!

బరువు తగ్గటం అంటే అందరికీ ఇష్టమే. మనలో చాలామంది బరువు తగ్గటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు వ్యాయామం చేస్తే,మరి కకొందరు ఆహరం విషయాల్లో కొన్ని నియమాలను పాటిస్తుంటారు. ఇలా ఎన్నో విధాలగాబరువు తగ్గాలని అందరూ ట్రై చేస్తూనే ఉంటారు.అయితే బరువు తగ్గటం కోసం మనం ప్రయత్నిస్తే,బరువు తగ్గితే మన ప్రయత్నం ఫలించినట్టు, మరియు ఆరోగ్యానికి మంచిది కూడా.

కానికొందరు బరువు తగ్గటం కోసం ఏ ప్రయత్నం చెయ్యకుండానే బరువు తగ్గుతుంటారు. అలాంటివారుజాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అలా ఏ ప్రయత్నం లేకుండా బరువు తగ్గుతున్నారు అంటేకొన్ని సమస్యలు ఉన్నట్టే. అవేమిటో తెలుసుకుందాం…ఒత్తిడి: కారణం ఏదయినా బాగా ఒత్తిడిగాఉన్నప్పుడు చాలామంది అన్న పానీయాలు మానేస్తుంటారు. దాంతో బరువూ తగ్గుతారు.నిద్రలేమి కూడా బరువు తగ్గడానికి ఒక కారణం. దీన్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే అంతమంచిది.మధుమేహం, కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లూ,జీర్ణసంబంధ సమస్యల వల్ల కూడా కొన్నిసార్లు బరువు తగ్గుతారు.

ఈలక్షణాలు కనిపించినప్పుడు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.చికిత్స తీసుకుంటూనే. వైద్యుల సలహాతో సరైన ఆహారాన్నీ ఎంచుకోవడం మంచిది. థైరాయిడ్‌: మన జీవనక్రియలను థైరాయిడ్‌ గ్రంథినియంత్రిస్తుంది. ఇది థైరాక్సిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. దీనిలో తలెత్తేమార్పులు బరువుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో మార్పులవల్ల కొన్నిసార్లు బరువు పెరిగితే, మరికొన్నిసార్లు తీవ్రంగాతగ్గిపోతారు. ఒకవేళ హైపర్‌ థైరాయిడిజం ఉంటే గనుక బరువు తగ్గుతారు. అంటే ఈ గ్రంథి ఆహార్మోన్‌ని ఎక్కువగా విడుదల చేస్తుంది. అలాంటప్పుడే ఈ సమస్య ఎదురవుతాయి. దీనికిజీవనవిధానంలో మార్పులతోపాటూ మందులూ వాడాల్సి ఉంటుంది.