ప్రతి రోజూ పండగే గురించి బన్నీ ఏమన్నాడో తెలుసా?

ఇటీవల రిలీజ్ అయిన ప్రతి రోజూ పండగే సినిమా ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. సాయి ధర్మ తేజ్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూసి ఆనందించాల్సిన సినిమా. అసలు ఈ సినిమా పండగ సీజన్ లో రిలీజ్ అయ్యి ఉంటె ఇంకా బాగున్ను. అయితే అప్పటికి పెద్ద పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. ఏది ఏమైనా ప్రతి రోజూ పండగే సినిమా మంచి ఆదరణ పొందింది. సాయితేజ్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. రాశీఖన్నా హీరోయిన్. రావు రమేష్‌, సత్యరాజ్‌ కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమాలో రావురమేష్ పాత్ర చాలా బాగుంది. ఆయన ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఆయన నటనకి, డైలాగ్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాకి హీరో ఒకరు కాదు, ఇద్దరు అందులో ఒకరు సాయిధర్మ తేజ్ అయితే, మరొకరు రావు రమేష్ అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 2019 సంవత్సరం సాయి ధర్మ తేజ్ కి చాలా బాగుందనే అనుకోవాలి. ఈ ఏడాది మొదలులో వచ్చిన చిత్రలహరి సినిమా విజయవంతం కాగా, ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి 2019 తేజ్ కి సక్సెస్ ఇయర్ గా మిగిలింది.

ఈ సినిమాని ఎందరో చిత్ర ప్రముఖులు ప్రశంసించారు. ఈ సినిమా గురించి అల్లు అర్జున్‌ సైతం ‘ప్రతిరోజూ పండగే’ టీమ్ ని అభినందించారు. ”ప్రతిరోజూ పండగే’ చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమాతో సాయితేజ్‌ హిట్‌ అందుకున్నందుకు, స్నేహితుడు మారుతి విజయం సాధించినందుకు, బన్నీ వాసు ఓ మంచి సినిమాను తన ఖాతాలో వేసుకున్నందుకు, నా తండ్రి మంచి వసూళ్లను రాబట్టుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. యూవీ ఫిల్మ్స్‌కు కంగ్రాట్స్‌. ఈ సినిమాతో మరో మంచి ఆల్బమ్‌ను అందించిన తమన్‌కు అభినందనలు’ అని బన్నీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.