రూలర్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అదేనంట! నిజమేనా?

బాలకృష్ణ హీరోగా ఈ నెల రూలర్ సినిమా రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకి కె.యస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. సి. కల్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పై నందమూరి ఫాన్స్ భారీ అంచనాలని పెట్టుకున్నారు. కానీ ఏమి ప్రయోజనము లేకుండా పోయింది. సినిమా మొదట కొంత యావరేజ్ టాక్ తెచ్చుకుంది. నిమ్మదిగా ఫ్లాప్ అని అనిపించుకుంది. కలెక్షన్స్ అయితే అస్సలు బాలేవని తేలింది. అయినా కూడా పాపం చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టుకుని వారిని వారు ఏదో రకంగా సమర్ధించుకోవడానికి ప్రయత్నించారు.

సినిమాని మొదట బాగా ప్రమోషన్ చేశారు. కానీ వారం తిరిగేసరికి కలెక్షన్స్ మరీ వీక్ గా ఉండటంతో ఇక ప్రమోషన్ కూడా వదిలేసారు. బాలయ్యను ఫాన్స్ ఎంతగా అభిమానించినా సినిమాలో సత్తా లేకపోతే ప్రేక్షకుల ఆదరణ పొందటం చాలా కష్టం. అయితే చిత్ర దర్శకుడిని సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం అడగగా, అసలు సినిమా చాల బాగుందని ఫ్లాప్ కాదని అన్నారు. మరి సినిమా బాగుంటే కలెక్షన్స్ ఎందుకు రావడం లేదని అడగగా ఆయన ఇలా అన్నారు.

సినిమా చాలా బాగా వచ్చింది. కానీ ఫైరసీ వలన సినిమా చూడటానికి ఆడియన్స్ ని థియేటర్ వరకు రానివ్వడం లేదని అన్నారు. కేవలం ఫైరసీ సీడీ ల వలెనే సినిమాకి కాలేషన్ లేదని, లేకుంటే సినిమా మంచి హిట్ అని అన్నారు. తన తరవాత సినిమా కూడా చాలా బాగా తీస్తానని చెప్పారు. పైరసీ వలనే సినిమాకి కలెక్షన్ రావడం లేదు అనుకుంటే, ఇక మిగిలిన సినిమాలు దేనికి కూడా కలెక్షన్ రాకూడదు కదా? కానీ మిగిలిన సినిమాలకు కలెక్షన్ వస్తుంది. పోనీ ఫైరసీ వాళ్ళు ఈ సినిమాని మాత్రమే ఫైరసీ చేస్తున్నారా? అంతేకాదు ఫైరసీ వలన సినిమాలు కలెక్షన్ రావు అని అంత గట్టిగా దర్శుకుడు నమ్మితే, ఇక మరో సినిమా తీసినా, అది కూడా రూలర్ అంత హిట్ గా తీసినా ఫైరసీ వలన కలెక్షన్ రాదు కదా? ఇలాంటి అనుమానాలు ఎందరిలోనో రావడం సహజమే మరి…