ఆ పాప ఎవరో గాని వాళ్ళ నాన్న గురించి చెప్పి బాధపడింది

కుటుంబసభ్యులు ఇలా ఆలోచిస్తే, ఆ కుటుంభానికి కొరత అనేదే ఉండదు… 

కుటుంబము అనే మాట వింటే భారతదేశం గొప్పతనం కనిపిస్తుంది. చాలా దేశాలలో కుటుంబం అంటే ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉంటుంది? దాని వలన ఎలాంటి లాభాలు, ఎలాంటి ఓదార్పు, ఆనందం దొరుకుతాయో తెలియదు కూడా. మన భారతీయ సంస్కృతి మనకి ఇచ్చిన గొప్ప వరం కుటుంబం. కుటుంబం ఎంత బలంగా ఉంటె ఆ ఇంట్లో ఉన్నవారందరూ అంత ఆనందంగా ఉంటారు. కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా కుటుంబానికి ప్రాముఖ్యతను ఇస్తున్న భారతదేశ ప్రజలు నిజంగా ఎంతో గొప్పవారనే అనుకోవాలి. నిజానికి కుటుంబంలో ఉండే ఆ మాధుర్యమే మనల్ని అంతగా కట్టి పడేస్తుంది. 

కుటుంబం సక్రమంగా నడవాలి అంటే మొదట భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి. వారు ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఒకే మాట మీద ఉంటారో , అంత చక్కగా, సక్రమంగా పిల్లలను పెంచగలరు. ఒకే మాట మీద ఉండటం అంటే, ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాలి లేదు, అలా ఉండదు కూడా. మన చేతి 5 వెళ్లే ఒకలా ఉండవు… అలాంటిది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన భార్యా భర్తలు ఒకేలా ఎందుకు ఆలోచిస్తారు.  ఆలోచనలు ఒకేలా లేకపోయినా, ప్రేమతో ఎవరో ఒకరి దారిలో ఇంకొకరు నడవాలి. ఒకరికోసం ఇంకొకరు అన్నట్టు ఉండాలి. అప్పుడే వారిద్దరి మధ్య బంధం గట్టి పడుతుంది. ఆ బంధంలో పిల్లలు భద్రంగా చక్కగా పెరుగుతారు. 

ఇక పిల్లలను పెంచడం నిజంగా తల్లితండ్రులకు ఒక పరీక్షే అని చెప్పాలి. ఎందుకంటే, పిల్లలు ప్రతీ వయసులో చేసే పని మనం ఒకప్పుడు చేసిన పనులను గుర్తు చేస్తాయి. మంచివి అయితే నావే అని మురిసిపోతాం. అదే చెడ్డ పనులు చేస్తే, మనం ఒకప్పుడు ఇలా ఆలోచించాం కదా అని అని గుర్తు వచ్చినా కూడా మన పిల్లలు ఆ పని చేయడానికి మనం ఒప్పుకోము. అలాగని వాళ్ళ మీద అరిస్తే వాళ్ళు వినరు. ఇప్పటి జనరేషన్ కెరీర్ లో ఫాస్ట్ ముందుకు వెళ్తున్నారనని ఆనందించాలో, దాని వలన వారికి స్వతంత్ర భావాలు ఎక్కువ అయ్యి అనర్ధాలకు దారి తీస్తున్నాయి అర్ధం కావడం లేదు. ఈ రోజుల్లో ఆడపిల్ల గాని, మెగా పిల్లడు గాని ఆదాయం మొదలవ్వగానే వారిలో ఉండే నిజతత్వాన్ని బయట పెడుతున్నారు. 

ఎప్పుడైతే వీరికి ఆదాయం మొదలవుతుందో, వీళ్ళు ఇంక అస్సలు ఎవ్వరి మాట వినరు. బంధాలు విషయంలో ఎవ్వరి మాట వినరు అని కొందరు అనుకుంటారు. కానీ అలా కాదు మనం చిన్నపాటి నుంచి ఒక విలువలతో పెంచితే మన పిల్లలు ఉత్తమమైన దారిలోనే వెళ్తారు. ఆడపిల్లకు తల్లి ఆదర్శం అయితే మగ  పిల్లవాడికి తండ్రి ఆదర్శం. మీరు ఏమి చేస్తే, మీ పిల్లలు అదే చేస్తారు. ఇంటికి వంశానికి తోడుగా నిలిచే మగపిల్లవాడు పెంపకంలో తండ్రి కొని జాగ్రత్తలు పాటించాలి. ఒక వయసు వచ్చాక కొడుకుతో స్నేహంగా మారాలి తండ్రి. కొడుక్కి తన గురించి థన్ పూర్వీకుల గురించి చెప్పాలి. కష్టం విలువ, కష్టకాలంలో కుటుంబ సభ్యుల విలువ గురించి చెప్పాలి. అలాగే కోడు కూడా తండ్రి తో అన్ని షేర్ చేసుకోవాలి. తండ్రి చెప్పిన మాట వినాలి. అయితే కొందరి ఇంట్లో తండ్రికి కొడుక్కి అస్సలు పడదు, 

తండ్రి కొడుకులు సమన్వయంగా లేకపోతే ఆ కుటుంబానికి చాలా నష్టం. తండ్రి అనుభవాన్ని తనకు అండగా తీసుకుని భవిష్యత్తులోకి దూసుకుకి వెళ్ళాలి కొడుకు. తండ్రి కొడుకులు ఒకరితో ఒకరు గురు శిష్యులులా, ఒకరితో ఒకరు స్నేహంగా ఉండాలి. ప్రతీ మంచి చేదు కలసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. కొందరి ఇంట్లో తండ్రీ కొడుకుల మధ్య అస్సలు పడదు. అలాంటి వారు ఎం చెయ్యాలంటే… ప్రతీరోజు 5 వత్తులతో శివాలయంలో దీపం వెలిగిస్తే మంచి. అలాగే శివ పురాణం పారాయణం చేసినా మంచి జరుగుతుంది. అంతే కాకుండా ఇద్దరి జాతకాలలో ఎవరికైనా రవి దోషం ఉంటె దాని నివారణకు పూజలు, హోమాలు చేయిస్తే మంచిదని అంటారు.