పాయల్ దానికి నానా ప్రయత్నాలు చేస్తుందట! నిజమేనా?

పాయల్ అనగానే ఆర్.ఎక్స్ 100 సినిమా గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో ఈమె బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా కనిపించి, హద్దులు దాటి మరీ లిప్ కిస్ లతో యూత్ ని మైమరిపించింది. ఈ సినిమాతో ఈమె పేరు యూత్ నోట్లో మారు మ్రోగింది. లవ్ సినిమా లలో కొంత రొమాన్స్ అనేది ఉంటుంది కానీ, ఈ సినిమాలో హీరోయిన్ చేసే రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా అంతటి హిట్ కొట్టినప్పటికీ… హీరో డైరెక్టర్ కి ఎంత పేరు వచ్చిందో తెలియదు కానీ పాయల్ పేరు మాత్రం వైరల్ అయ్యింది.

దీనితో ఈ పాయల్ కి సినిమాల్లో ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. ఎంతగానో యూత్ ఆదరణ పొందిన ఈ అమ్మడు రెండవ సినిమా సెలక్షన్ విషయంలో కొంత తప్పు చేసింది. రెండవ సినిమాగా ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ అంటూ మరో డీగ్రేడ్ సినిమాకి ఒప్పుకుంది. ఈ సినిమాతో ఈమెకు చాలా బాడ్ నేమ్ వచ్చింది. మొదటి సినిమాకి గ్లామర్ గర్ల్ గా పేరు పొందితే, రెండవ సినిమాకి ఈమె ఇంతే అని చెడ్డ పేరు తెచ్చుకుంది. దీనితో ఆడియన్స్ ఈమెను ఐటెం హీరోయిన్ లిస్ట్ లో వేసేసారు.

ఇటీవల రిలీజ్ అయిన, వెంకిమామ సినిమాలో ఎంత జాగ్రత్తగా నటించినా కూడా ఆ సినిమా హిట్ అయినప్పటికీ… ఈమెకి మాత్రం పేరు రాలేదు. అంతేకాదు ఈమె మొదట రెండు సినిమాలు కూడా అలాంటి పాత్రలే నటించడం వలన, ఇక పై వచ్చే సినిమాలు కూడా అలాంటి పాత్రలకే ఆఫర్లు ఇస్తున్నారట. దీనితో తన పై వచ్చిన ఈ రిమార్క్ పోగొట్టడానికి ఇక పై మంచి పాత్రలకే ఒప్పుకోవాలని, అలంటి పాత్రలు చేచిక్కించుకోవాలని నానా ప్రయత్నాలు చేస్తుందట…