ఇలా పెళ్లిచేసుకుంటే ఏమంటారో తెలుసా?

పెద్దల శాస్త్రంప్రకారం, దేవతా మంత్రాల సాక్షిగా వధూవరులు ఒకరినోకరి హస్తాలు గ్రహించి చేసుకోవడంవివాహం.కన్యను అలంకరించివరునికి ఇచ్చి చేసే వివాహం బ్రహ్మ వివాహం.యజ్ఞం చేయడం కోసం,ఋత్విక్కుకు కన్యని దక్షనగా ఇవ్వడం దైవ వివాహం.

ఆవు ఎద్దు దానంచేసి, ఆపై కన్యను ఇవ్వడం ఆర్షవివాహం.మహానుభావునికి ప్రియురాలిగాసహధర్మచారినిగా ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం ప్రాజపత్య వివాహం.తల్లితండ్రి అనుమతిలేకుండా, ఇరువురూ చేసుకోవటము గాంధర్వ వివాహం.

షరతు పెట్టి వివాహంచేసుకోవడం అసురవివాహం.కన్యను బలాత్కారంగాపెళ్లి చేసుకోవడం, రాక్షస వివాహం.కన్య నిడురుపోయేటప్పుడు,ఏమరుపాటుగా ఉన్నప్పుడు, చేసుకున్న వివాహం పైశాచిక వివాహం అంటారు.