జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆమె ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశారట! నిజమేనా?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లో వీరిద్దరికి ఎంత క్రేజ్ ఉందొ మనందరికీ తెలుసు. అందుకే వీళ్ళిద్దరూ రాజమౌళి నెక్స్ట్ సినిమాలో హీరోలుగా కలసి నటిస్తున్నారు. ఇద్దరు పెద్ద స్టార్స్ ని హీరోలుగా పెట్టి సినిమా తియ్యడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఎవరితోనైనా, ఎంత బడ్జెట్ సినిమాని అయినా… అద్భుతంగా తీర్చిదిద్దడంలో జక్కన్న ఎంతటి ప్రతిభావంతుడో ప్రపంచం మొత్తానికి తెలిసిందే.

ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తే, ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో నటిస్తున్నారు. మరి వీరిద్దరిని ఎంత చక్కగా చెక్కి, పత్రాలు చిరస్మరణీయంగా మిగిలిపోయేలా జక్కన్న ఎంత అద్భుతం చేస్తారో చూసేందుకు ఫాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినీమా షూటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకు లోయల్లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా మధ్యలో విరామం వచ్చింది. ఈ విరామం సమయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఒకరి ఇంటికి వెళ్లారట.

ఈ హీరోలు ఇద్దరికీ ఒక వీరాభిమాని ఉందట. ఎన్టీఆర్ , రాంచరణ్ ఇద్దరూ ఆ వీర అభిమాని ఇంట్లో సందడి చేశారట. షూటింగ్ లో విరామం సమయంలో వీళ్ళద్దరు ఆ అభిమాని ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేశారట. అంతే కాకుండా వీరిద్దరూ ఎంతో చనువుగా వంటగదిలో కూడా తిరిగారట. ఆమె ఎవరన్నది పేరు తెలియదు కానీ, ఆ భిమానితో వీరిద్దరూ తీసుకున్న సెల్ఫీ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..