కూతురు పక్కనే ఉండగా నాగబాబు అలా చేయడం బాలేదంటున్న నెటిజనులు…

నాగబాబు జడ్జి గా చేసిన జబ్బర్దస్థ్ షో ఎంతగా హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ షో పై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అలాగే దీన్ని బ్యాన్ చెయ్యాలని ఎందరో చెప్పారు. ఈ రేటింగ్ ఎంత హై కి వెళ్లిందో కూడా చెప్పుకునే వారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ టీవీ కి పోటీగా జీ తెలుగు ఛానల్ వారు జబ్బర్దాస్త్ షో లో కీలకమైన వారిని కొందరిని లాక్కున్నారు. అందులో నాగబాబు ఒకరు.

జీ తెలుగు లో ఆదివారం ‘అదిరింది’ షో అంటూ లైవ్ షో వస్తుంది. ఈ షో చూస్తుంటే అచ్చం జబ్బర్దస్థ్ షో చూస్తున్నట్టు ఉంటుంది. ఆడియన్స్ అందరూ ఈ షో చూస్తున్నంతసేపు జబ్బర్దస్థ్ ని తలపించారు. దీనితో ఈ షో కూడా మంచి పాపులర్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇందులో కూడా స్కిడ్ లు డబల్ మీనింగ్ డైలాగ్స్ తో దద్దరిల్లిస్తున్నారు. మొన్న ఆదివారం జరిగిన ‘అదిరింది’ షో కి నాగబాబు జడ్జి గా వస్తే, ఆయన కూతురు నిహారికా స్పెషల్ గెస్ట్ గా వచ్చింది.

మామూలుగానే మహిళ ఆర్టిస్టు అందంపై చంద్ర స్కిట్ ప్రారంభించాడు. ఇందులో భాగంగానే సర్ మా ఆవిడ ఎలా ఉంది సార్ అని నాగబాబుని అడుగుతాడు. దానికి నాగ బాబు కత్తిలా ఉందహే అని సమాధానం ఇస్తాడు. కూతురు నిహారికాని పక్కన పెట్టుకుని నాగబాబు ఆలా ఎలా మాట్లాడాడని ప్రేక్షకులు వాపోతున్నారు. అంతే కాకుండా, స్కిట్ లో బూతు డైలాగ్స్ వచ్చినప్పుడు నాగబాబు పది పది నవ్వుతాడు. నిహారికాను పక్కన
పెట్టుకుని ఇలాంటి డైలాగ్స్ కి రియాక్ట్ అవ్వడానికి నాగబాబు కి సిగ్గు లేదా అని నెటిజనులు వాపోతున్నారు…