క్షణాల్లో స్మార్ట్ ఫోన్లు మాయం అవుతున్నాయట! నిజమేనా?

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి చేతిలో మనం చూసేది స్మార్ట్ ఫోన్ అని మనకు తెలిసిందే. స్మార్ట్ ఫోన్ అంటే మనిషికి అవసరం కాదు ప్రాణం అన్నట్టు తయారు అయ్యింది. ఒక చిన్న ఫోన్ వారి చేతిలో ఉంటె, ప్రపంచం మొత్తం వారి చేతిలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. ఎంత దూరం అయినా వారు సెకండ్ లో, నయనాలతో చేరుకోగలం అని ఆనందంగా ఉంటున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు, అందులో ఉన్న కొత్త ఫెసిలిటీస్ ఏమాటని చూస్తున్నారు గాని, దాని ధర ఎంత అనేదాని పై అంతగా దృష్టి పెట్టడం లేదు. అంతగా అవసరం అయిన స్మార్ట్ ఫోన్ ని 24 గంటలు వారి పక్కనే పెట్టుకుని ఉంటున్నారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, ఎప్పుడు దాని లోకంలోనే ఉంటున్నారు.

అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ల చోరీ మాత్రం బాగా పెరిగింది. క్షణాల్లో స్మార్ట్ ఫోన్ లను దొంగలు మాయం చేస్తున్నారు. బెంగుళూరు పోలీసులు, ఈ స్మార్ట్ ఫోన్లు పోగొట్టుకున్నవారు ఫిర్యాదు చెయ్యడం కోసం ఒక యాప్ విడుదల చేశారు. ఆ యాప్ పేరు ఈ లాస్ట్ యాప్. ఈ యాప్ కి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక ఏడాదిలో 97,963 ఫిర్యాదులు వచ్చాయి. ఒకొక్క ఫోన్ కనీసం 10 వేల  రూపాయలు మినిమం ఉంటుంది… ఈ లెక్కన పోయిన ఫోన్ల విలువ  వంద కోట్లకు దగ్గర ఉంటుందని అధికారులు అంటున్నారు. సినిమాలకు, హోటల్స్ కు వెళ్ళేటప్పుడు క్యాబ్ ఎక్కేటప్పుడు ఇలా ఎక్కడంటే అక్కడ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, మరచిపోయినా వెంటనే వాటి కోసం నిఘా వేసుకుని కూర్చున్న స్మార్ట్ ఫోన్ స్మార్ట్ దొంగలు వెంటనే నొక్కేస్తున్నారు.

ఫోన్ ని పోగొట్టుకున్న వెంటనే ఆ యాప్ లో కంప్లైంట్ ఇచ్చి రసీదు తీసుకోవాలి. అలా చేయడం వలన మీ ఫోన్ ని పోలీసులు పట్టుకుంటారు. ఈరోజుల్లో పోయిన స్మార్ట్ ఫోన్లను పట్టుకోవడం పోలీసులకు అంత కష్టం కాదు. ఎందుకంటే, ప్రతి మొబైల్‌కు ఇంటర్నేషనల్‌ మొబైల్‌ ఇక్విప్‌మెంట్‌ ఐడెంటిపికేషన్‌(ఐఏంఇఐ) నెంబరు ఉంటుంది. టెలికాం కంపెనీలకు ఇఏఇఐ సమాచారం అందించి ఏదైనా సిమ్‌కార్డుతో యాక్టివేట్‌ చేసినప్పుడు సమాచారం తెలియజేయమని పోలీసులు చెబితే, వాళ్ళు సమాచారం అందిస్తారు. ఈ విధంగా బెంగుళూరు పోలీసులు కంప్లైంట్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను తీసుకుని వాటిని పట్టుకునే పనిలో ఉన్నారు…