మనువు స్త్రీ గురించి ఏం చెప్పాడో తెలుసా?

మనువు సతీ గురించి అనేక ధర్మాలను చెప్పాడు. ఎక్కడ స్త్రీని పూజిస్తే, అక్కడ దేవతలు నాట్యం చేస్తారనిచెప్పాడు. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలన్నా, పోగోత్తలన్నా స్త్రీయే కారణంఅని అన్నాడు. అటువంటి స్త్రీని రక్షించుకోవాలని, సుఖపెట్టాలని చెప్పాడు. అలాగే తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు వెయ్యాలో కూడా చెప్పాడు.స్త్రీ ని ఇష్టం లేకుండా పొందితే, దొంగతనానికి శిరచ్చేదంచేయ్యమని చెప్పినట్టు…దీనికి లింగచ్చేదం చెయ్యమని చెప్పాడు.

కూతురు విషయంలో తండ్రి సరిగ్గా బాద్యత నిర్వర్తించకపోతే, కూతురుతనకు నచ్చినవాడిని ఎంచుకుని పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు.డప్పు,ఎద్దు,ఆడది కొడితేనే మాట వింటారని చెప్పాడు.ఆరోజుల్లో అతను చెప్పినవి ఈరోజుల్లో వరకు చాలా వాటినిపాటిస్తున్నారు.అయితే ఆతను చెప్పింది రైటా, రాంగా అనేదాని కంటే… ఈ కాలంలోమనువు చెప్పిన ధర్మ శాస్త్రంలో ఏం నేర్చుకోవాలో ఏం వదిలేయాలో తెలుసుకోవడానికిఅయినా మనుధర్మ శాస్త్రం చదవండి.

మనువుని చాలామంది విమర్శిస్తారు. కాని ఆయన చెప్పిన అనేక మంచివిషయాలను వదిలేస్తున్నారు.తల్లితండ్రి బ్రతికి ఉన్నంత వరకు ఆస్తి పంచుకోకూడదని,విదిపోవద్దని చెపాడు. మరి ఇలాంటి మంచి ధర్మాలు కూడా ఎన్నో చెప్పాడు…