మీ కూరల్లో ఇవి వేస్తే చాలు ఎంతో ఆరోగ్యంగా వుంటారు

తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉన్నా, ఈ తరానికి మాత్రం అందుకే ఉండదట!
“ధనం”ఎక్కడ విన్నా, చూసినా మనిషిలో దీని గురించే ఆరాటం ఉంటుంది. దీనిని సంపాదించుకునేందుకె పోరాటం. పూర్వం మన పెద్దవాళ్ళు ధనం అవసరానికి ఉంటె చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు మాత్రం ధనం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలని అనుకుంటున్నారు. కేవలం అవసరాలు తీరేందుకు కావలసిన డబ్బుని… మన అవసరాలు, ఆడంబరాలు, ఆశలు పెంచేసుకుని దానికి తగ్గట్టు డబ్బు కోసం ఆరాట పడుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే… ఇవన్నీ వీరికి మాత్రమే కాదు, వీరికి వీళ్ళ పిల్లలకి ఆ తరవాత 3 తరాల వరకు సరిపోయేలా డబ్బు దాసెయ్యాలని ఇప్పటి జనరేషన్ కొందరి ఆరాటం.

తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉందని కొందరు అంటారు. కానీ నిజం కాదు. ఎందుకంటే ఎంతటి ధనం ఉన్నా కూడా 4 గవ తరానికి డబ్బు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనలక్ష్మికి స్థిరం ఉండదని అందుకే ఆమె ఒక చోట ఉండిపోదని అంటూ ఉంటారు. అంతే కాదు, మనిషికి ధనం ఎక్కువగా ఉంటె స్థిరమైన మనస్తత్వం ఉండదు. డబ్బు విలువ తెలియక, అహంకారంతో ఉన్నవి అన్ని పోగొట్టుకునే స్థితి వస్తుంది అని మన పెద్దలు అంటారు. డబ్బు ఎక్కువ అయ్యేకొద్దీ, మనిషిలో తనకు తెలియకుండానే ఎక్కువగా తన పై తనకి నమ్మకం పెరిగిపోతుంది. దానితో తాను ఎం చేసినా రైట్ అనే అనిపిస్తుది.

ఎందుకంటే డబ్బు ఉన్నవాడు ఏం చెప్పినా తన చుట్టూ ఉండే ప్రపంచం దాన్ని సమర్థిస్తుంది. ఎందుకంటే వారికీ డబ్బు అవసరం కాబట్టి, డబ్బున్న వారిని పొగడక తప్పదు. అలా పొగిడే వాళ్ళు చుట్టూ ఉంటె, మనిషికి తాను చేస్తున్నది కరక్టే అనే అహంకారం మొదలవుతుంది. అహంకారం పెరిగినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని సమర్ధించుకోవడం అలవాటు అవుతుంది. మన శ్రేయస్సు కోరి మనకు మంచి చెప్పేవారు, మనలో తప్పులు ఎంచేవారు మనకు నచ్చరు. మన తప్పులను వాళ్ళ అనుకూలం కోసం పొగిడేవారు నచ్చుతారు. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకూడని వారిని నమ్మి వాళ్ళ చేతిలో విలువైనవి పెట్టి నష్టపోతాం.

అంతేకాదు ధన అహంకారం మనిషికి ప్రేమని, ఆప్యాయతని, ధర్మాన్ని, న్యాయాన్ని మరచిపోయెలా చేసి, వాటి నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఇవి మన దగ్గర లేకపోతే ఎంతటి డబ్బయినా కరిగిపోతుంది. అందుకే తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉందని అన్నా అది నాలుగు తరాలు మించి ఉండ దని మన పెద్దలు అంటారు…