ముఖం మీద మచ్చలు ,మొటిమలు తగ్గాలి అంటే ఈ చిట్కాలు పాటించండి చాలు

ముఖం మీద మచ్చలు ,మొటిమలు తగ్గాలి అంటే ఈ చిట్కాలు పాటించండి చాలు

అందం…అందాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరేమో, ఒకటి వాళ్ళయినా అందంగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళ చుట్టూ ఉన్న వారులో కూడా అందమైన వారిని చూసి ఆనందిస్తుంటారు. వయసు పెరిగే కొద్దీ అందం అంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని అనుకుంటారు. కానీ ఎంత వయసు పెరిగినా మనిషికి అందం మీద ఆత్రం మాత్రం తగ్గదు. అందం ఆనందాన్ని ఇస్తాది. ఈరోజుల్లో ఎండలో పని చెయ్యడం, బయటకు ఎక్కడికో అతికష్టపడి వెళ్లడం లాంటి పనులు కొంతవరకు తగ్గాయి. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇంట్లోనో, లేక కంప్యూటర్ ముందు ఏసీ లో కూర్చొని పని చేయడం లాంటి పనులు పెరిగాయి. వీటి వలన శరీరానికి సుఖం ఉంటుంది కానీ… సరైన శ్రమ, సూర్యుడి వలన వచ్చే విటమిన్ డి లాంటివి సరిగ్గా అందక అనేక చర్మ వ్యాధులు వస్తున్నాయి.

ఇదిలా ఉంటె, అందం మీద మనుషులకు ఇష్టం ఎంతగా పెరుగుతుందో వాటి మీద వ్యాపారాలు కూడా అంతగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి బ్యూటీ పార్లర్లు పెరిగిపోతూ ఉన్నాయి. చాలా మంది ప్రతీ నెల బ్యూటీ పార్లర్లకు పదిహేను రోజులకు ఒకసారి వెళ్లకుండా ఉండలేకపోతున్నారు. అందులోనూ ఇప్పుడు ఆడవారు కూడా ఎక్కువగా బయటకు వెళ్లి వృత్తి పనుల్లో నిమగ్నం అవ్వడం వలన వారి జీతంలో కొంత భాగం ప్రతీ నెల వారు అందాన్ని నిలబెట్టుకోవడానికి ఖర్చులు పెట్టడానికి వెనకాడటం లేదు. మరి నిజంగానే అది ఖచ్చితంగా చేయాల్సిన పనే.అందు వలన రోజు రోజుకి బ్యూటీ పార్లర్ల సంఖ్య పెరుగుతూ వస్తూంది. వాటి మధ్య కూడా విపరీతమైన పోటీ నడుస్తుంది.

బ్యూటీ పార్లర్ల సంఖ్య పెరిగే కొద్దీ, బ్యూటీ ప్రొడక్ట్స్ పెరుగుతూ వచ్చాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ పెరిగే కొద్దీ పోటీ పెరుగుతుంది. వాళ్ళు బ్యూటీషన్స్ కు ఏ ప్రోడక్ట్ వాడితే ఎలాంటి ఫలితం వస్తుందో ప్రత్యేకమైన క్లాసెస్ కూడా ఇస్తున్నారు. వాటిని బట్టి కస్టమర్స్ సమస్యలు తెలుసుకుని, వాళ్ళు చెప్పక పోయినా వీళ్ళు కనిపెట్టి మరీ రెమిడీస్ చెబుతున్నారు.ఇలా బ్యూటీషన్ పై ఆడవారు ఆధారపడాల్సి వస్తుంది. పూర్వం అందం ఆడవారి సొత్తు అని అనుకునేవారు. ఆడవారికి మాత్రమే అందం అవసరం అని నుకునేవారు, కానీ ఇప్పుడు వారు వాళ్ళని మించి పోయారు. అందంగా రెడీ అవ్వడంతో వారు ఆడవారితో పోటీ పడ్తున్నారు.

మగవారు సెల్ఫ్ గ్రూమింగ్ ఇప్పుడు బాగా మైంటైన్ చేస్తున్నారు. వీలు కూడా ఫేషియల్స్ అవి చేయించుకుని అందంగా రెడీ అవుతున్నారు. వయసుని బయటకు చూపించుకోవడం ఆడవారు గాని మగవారు కానీ ఇద్దరు అస్సలు ఇష్టపడటం లేదు. వయసు పెరుగుతున్నవారికి వయసు కనబడకూడదని తాపత్రయం ఉంటె, మరి పాపం వయసులో ఉన్నవారికి అందం పై ఇంకా ఇంట్రస్ట్ ఉంటుంది కదా.. వయసులో ఉండగా ఎవరైనా అందంగానే ఉంటారు కానీ, కాకపోతే వయసు వలన వారి ముఖం పై మొటిమలు మాత్రం వస్తాయి. వాటి వలన కొందరికి కొన్ని మచ్చలు కూడా ఏర్పడతాయి. మరి ఇలాంటి సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియాలంటే పై వీడియో చూడండి…