రివ్యూని బట్టి ఆన్లైన్ లో వస్తులు కొనడం కష్టమేనట! నిజమేనా?

Online Reviews Evaluation time for review Inspection Assessment Auditing

ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు వస్తువులు కొనాలి అంటే ఆన్లైన్ లోనే కొనడానికి ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికో వెళ్లి, వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే చూసి అందులో ఎన్నుకోవడం ఇప్పుడు జనరేషన్ అంతగా ఇష్టపడటం లేదు. ఆన్లైన్ లో అనేక వెబ్సైట్ అనేక వస్తువులను చూసి, అందులో ఎన్నుకుంటున్నారు. అయితే ఆన్లైన్ లో వస్తువు కొనాలి అనుకుంటప్పుడు, మొదటగా వారికి కంటికి నచ్చిన వస్తువు చూసుకుని, దాని రేటింగ్ గురించి చూస్తారు. రేటింగ్ బాగుంటే వెంటనే వారి మనసు దాని పై వెళ్ళుతుంది.

అందుకే వస్తువును అమ్మేవారు వారి ప్రోడక్ట్ యొక్క రేటింగ్ బాగుండాలని కోరుకుంటారు. అయితే కొందరు వ్యాపారస్తులు వారి వస్తువుల రేటింగ్ బాగుండాలని, దాని గురించి కొన్ని అడ్డ దారులు కూడా వెతుకుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అమెజాన్ లాంటి పాపులర్ వెబ్సైట్ లో కూడా విక్రయదారులు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ రివ్యూల కోసం సదరు విక్రేతలు 15 యూరోల(అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1200) చొప్పున చెల్లిస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘డెయిలీ మెయిల్‌’ దర్యాప్తు కథనంలో పేర్కొంది. దీని పై కొన్ని సంస్థలు పరిశోధించాయి.

ఈ పరిశీలకులు అమెజాన్‌లో ఆయా సంస్థల వస్తువులను కొని వాటికి 4 స్టార్‌, 5 స్టార్‌ రేటింగ్‌లు ఇస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు విక్రేత సంస్థలు సదరు పరిశీలకులకు ఆ వస్తువు కొనుగోలుకు అయిన ధరను తిరిగి ఇవ్వడంతో పాటు చిన్న మొత్తంలో ఫీజు చెల్లిస్తున్నట్లు ‘డెయిల్‌ మెయిల్‌’ కథనంలో వెల్లడించింది. వీటి పై అమెజాన్ ఇలా స్పందించింది. రివ్యూలపై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని చెప్పింది. అందుకోసమే గతేడాది 300 మిలియన్‌ పౌండ్లు వెచ్చించినట్లు తెలిపింది.