విజయ్ దేవరకొండ ని జాన్వీ లవ్ చేస్తుందా! నిజమేనా?

ప్రస్తుతం అమ్మాయిల మనసుకు గ్రీక్ వీరుడు ఎవరు అంటే, అది విజయ్ దేవరకొండ అని మనందరికీ తెలుసు. ఏ అమ్మాయిని అడిగినా, నాకు విజయ్ లాంటి లవర్ గాని లేదా విజయ్ లాంటి మొగుడు గాని కావాలని అంటున్నారు. అమ్మాయిల మనసును అంతగా దోచుకున్నాడు విజయ్ దేవరకొండ. తన ప్రతీ సినిమా ఒక కొత్త ఫంధాలో ఉంటుంది. ఆసినిమాలో, ఆ పాటతో ఎంతో మంది మనసులు దోచుకుంటాడు మన విజయ్ ఎవరకొండ. అర్జున్ రెడ్డి తో యూత్ యావత్ ని అలరించగా, గీతాగోవిందంతో అమ్మాయిల మనసును దోచేశాడు.

అందులో హీరోయిన్ దగ్గర మేడం మేడం అంటూ ఎంతో ఒద్దిగ్గా నటించిన విజయ్ తీరుని చూసి అమ్మాయిలు అందరూ ఫిదా అయిపోయారు. వాళ్ళ జీవితంలోకి అబ్బాయి అంటూ వస్తే, అలాంటి వాడే రావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. సామాన్య అమ్మయిలే కాదు, సినీ స్టార్స్ కూడా విజయ్ అంటే ఇష్టపడ్తున్నారు. యావత్ భారతదేశానికి అతిలోక సుందరి అయినా శ్రీదేవి కూతురు జాన్వీ కి విజయ్ చాలా నచ్చాడు. విజయ్ గురించి తాను ఇంతకు ముందు కూడా మాట్లాడిన విషయం మనకు తెలిసందే.

జాన్వి తాజాగా నటి నేహా ధుపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి విజయ్‌ గురించి మాట్లాడింది. విజయ్ తన తన ఆల్‌ టైమ్‌ క్రష్‌ అని చెప్పింది. తాను విజయ్ గురించి ఇంతగా ఫీల్ అవుతున్నాను కానీ, నా గురించి ఆయన ఫీలింగ్ ఏమిటో తెలియదు అని అన్నది. విజయ్ పై నా అభిమానం స్థిరంగా ఉంది.కానీ అటు నుంచి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియడం లేదు అని అన్నది. ప్రస్తుతం విజయ్ పై కాకున్నా అభిమానం సురక్షితమైనదే. అందుకే ఆ విషయం పబ్లిక్ గా మాట్లాడుతున్నాను అని జాన్వీ చెప్పింది…